ఇంటి వద్దకే ఇఫ్తార్!


Mon,June 19, 2017 04:21 AM

సిటీబ్యూరో: సీజన్‌లో ఇంటికి అతిథులు వస్తే రంజాన్ రుచులు వడ్డించకుండా పంపించలేం. రంజాన్‌కు స్పెషల్ అయిన హలీం, ఇక హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ ఇంకా ఎన్నో నిజామియా క్యూజిన్ రుచుల్ని వడ్డిస్తుంటే కాదనకుండా ఆరగిస్తారు అతిథులు. బయటివారే కాదు సిటీలోనూ రంజాన్ స్పెషల్ హలీం, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ కోసం జోరు వానలోనూ బయలుదేరే వారున్నారు. పేరు ఉపవాస దీక్షలు ఉండేవారిది కానీ. ఈ విందులు ఆరగించేందుకు అందరూ సిద్ధంగానే ఉంటున్నారు. పెరిగిన డిమాండ్‌తో రంజాన్ స్పెషల్ వంటకాలను వడ్డించే ఔట్‌లెట్స్ పెరుగుతున్నట్లుగానే కొత్త సదుపాయాలూ అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఇఫ్తార్ పార్టీకి కావాల్సిన హలీం, బిర్యానీ, ఫ్రూట్స్, సలాడ్స్, స్నాక్స్‌ను ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది www.iftarparty.com. వెబ్‌సైట్, ఫోన్, యాప్‌తో ఆర్డర్ చేసే అవకాశం కల్పిస్తున్న ఇఫ్తార్‌పార్టీ డాట్ కామ్‌ని ఉపయోగించుకుంటే ఇంట్లోనే ఇఫ్తార్ పార్టీ చేసుకోవచ్చు. పిస్తా హౌస్ నిర్వహిస్తున్న ఈ పోర్టల్ ద్వారా పిస్తా హౌస్ స్పెషల్ హలీంతోపాటు ఖర్జూరాలు, ఫ్రూట్ సలాడ్స్, స్నాక్స్ చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో స్మైల్స్, రష్యన్ సలాడ్ మరెన్నో ఆర్డర్ చేయవచ్చు.

లోకల్ టు గ్లోబల్...
iftarparty.comని నగర వాసులే కాదు విదేశీయులూ ఉపయోగించుకుంటున్నారు. విదేశాల నుంచి ఈ యాప్‌తో ఆర్డర్ చేసుకునే వీలుంది. విదేశాల్లో హలీం అభిమానుల కోసం ఎప్పటి నుంచో డెలివరీ సర్వీసు నిర్వహిస్తున్న పిస్తా హౌస్ ఇప్పుడు ఆర్డర్లను నేరుగా ఈ యాప్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇఫ్తార్‌పార్టీడాట్‌కామ్‌తో హలీంతోపాటు రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీల కోసం కొనుగోలు చేసే తినుబండారాలన్నింటినీ ఇండియాతోపాటు సౌదీ అరేబియా, అమెరికా, అరబ్ ఎమరేట్స్, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఖాతర్, కువైట్, ఐర్లాండ్ దేశాల నుంచి ఆర్డర్ చేస్తున్నారు. అసవరం అనుకుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

312
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...