హామీల అమలులో బీజేపీ సర్కార్ విఫలం


Sat,May 20, 2017 12:16 AM

రాంనగర్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదంను పెంచిపోషిస్తున్నారని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఆరోపించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు సంయుక్త ఆధ్వర్యంలో బృందాకరత్‌తో మీట్ ది మీడియా కార్యక్రమాన్ని శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ రైతు, కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అధికారంలోకి రాక ముందు నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్‌ను తా ము వ్యతిరేకిస్తున్నామని, ట్రిపుల్ తలాక్ విధానంలో మార్పులు తేవాలని, అదే విధంగా వారి విశ్వాసాన్ని కూడా గౌర వించాలని సూచించారు.

పార్టీలకు కార్పొరేట్ విరాళాలను నిషేధించాలి రాజకీయ పార్టీలకు కార్పొరేట్ శక్తులు ఇచ్చే విరాళాలు ఇవ్వడాన్ని నిషేధించాలని బృందాకరత్ డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోప న్యాసాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం- ఎన్నికల సంస్కరణలు అనే అంశం పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా బృందాకారత్, ఎస్‌వీకే చైర్మన్ బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్‌వీకే కార్యదర్శి ఎస్ వినయ్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భం గా బృందాకరత్ మాట్లాడుతూ రాజకీయాల్లో కీలకమైన నిర్ణయాల సమయంలో కార్పొరేట్ శక్తుల ప్రభావం చూపుతుందన్నారు. పుచ్చలపల్లి సుం దరయ్య చూపిన మార్గంలోనే తాము ప్రయాణిస్తున్నామన్నారు. ఆయన ఆశయాలకు అనుకూలంగా నేటి తరం పార్టీ కార్యకర్తలు కూడా పని చేయాలని సూచించారు. బీవీ రాఘవులు మా ట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఎంతో మం దికి స్ఫూర్తిగా ఉన్నారని కొనియాడారు. దళిత వర్గాల అభ్యున్నతికి ఆయన నిరంతరం పాటుపడే వారని గుర్తుచేశారు.

242
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS