33 శాతం పెనాల్టీ చెల్లించండి


Sat,May 20, 2017 12:16 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లే అవుట్ రెగ్యు లరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్ ఎస్) దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిం చింది. సంబంధిత ప్లాట్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకో కున్నా భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేయనున్నారు. కాకపోతే ఎల్‌ఆర్‌ఎస్ ఛార్జీలకు అదనంగా 33శాతం రుసుం ( పెనాల్టీ) చెల్లించాల్సి ఉంటుంది. అయితే 28 అక్టోబరు 2015 నాటికి కటాఫ్ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే ఇందుకు అర్హులు. ఆ తర్వాత కొనుగోలు, రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ లకు వర్తించదు. ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ చిరంజీవులు చెప్పారు.

ఏడు జిల్లాల పరిధిలో విస్తృత అవగాహన అనధికారిక లే అవుట్లలో ప్లాట్ కొనుగోలు చేసిన వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 120 రోజుల పాటు ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ పథకాన్ని అవకాశం కల్పించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 1.72 లక్షల మంది ఈ పథకాన్ని సద్విని యో గం చేసుకున్నారు. అయిప్పటికీ ఈ పథకాన్ని దూరంగా లక్షల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా గతంలో ఎల్‌ఆర్‌ఎస్ జీవో గైడ్‌లైన్స్ ప్రకారమే అదనంగా 33 శాతం ఫీజును తీసుకుని భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ప్రజలకు స్పష్టత లేకపోవడం, 28-10-15 సంవత్సరం తర్వాత కొనుగోలు చేసిన వారు సైతం అదనపు రుసుం చెల్లిస్తామంటూ భవన నిర్మా ణానికి దరఖాస్తులకు ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏడు జిల్లాల పరిధిలో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించిన కమిషనర్ చిరంజీవులు ఈ మేరకు రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసారు. అనధికారిక స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలంటే ఎల్‌ఆర్‌ఎస్ ఛార్జీలతో పాటు అదనంగా 33 శాతం, ఓపెన్ స్పేస్ 14 శాతం ఛార్జీలు చెల్లించి క్రమబద్ధీకరించుకునే విధంగా వారిలో అవగాహన పెంచాలని అందులో పేర్కొన్నారు. ఈ సమయంలోనే గ్రామ పంచాయతీ డీపీవోలు, మున్సిపాలిటీల కమిషనర్లకు, టీటీసీపీ శాఖలకు లేఖలు రాసినట్లు అధికారులు తెలిపారు.

హెచ్‌ఎండీఏలోనే దరఖాస్తు చేసుకోవాలి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయని ప్లాట్‌లో భవనం నిర్మించాలకునే వారంతా తగిన వివరాలతో హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ (www.hmda.gov.in)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ప్లాట్ క్రమబద్ధీకరించుకోలేదన్న వివరాలతో పాటు సేల్‌డీడ్, ఈసీ, రిజిస్ట్రేషన్ విలువ తదితర డాక్యుమెంట్లు ఆప్‌లోడ్ చేయాలి. సాధారణంగా అనుమతి కోసం వసూలు చేసే రుసుముకు అదనంగా ఎల్‌ఆర్‌ఎస్ ఛార్జీలు చెల్లిం చాల్సి ఉంటుంది. మమూలుగా అయ్యే ఎల్‌ఆర్‌ఎస్ ఛార్జీలకు అదనంగా 33శాతం చెల్లించాలి. దీనికి రిజిస్ట్రేషన్ అయిన తేదీ నాటికి ఉన్న విలువను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో పాటు 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేస్తారు. దీనిని ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం నిర్ణయిస్తారు.

316
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...