బంగారు తెలంగాణలో భాగస్వాములమవుతాం


Sat,May 20, 2017 12:16 AM

ఖైరతాబాద్, మే 19 : బంగారు తెలంగాణ సాధనలో పెన్షనర్లు భాగస్వాములవుతారని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ ఆర్. విశ్వాస్ రెడ్డి అన్నారు. పదవీ విరమణ కేవలం తమ ఉద్యోగాలకు మాత్రమేనని, శరీరానికి కాదని, రాష్ర్టాభివృద్ధిలో పాలుంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవ పీఆర్‌సీ కమిషనర్ ఆదేశించినట్లు 70 సంవ త్సరాలు నిండిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.

ఉద్యమ సమ యంలో, ప్రస్తుత తెలంగాణలో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లందరికీ ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలన్నారు. పెన్షనర్ల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవటాన్ని హర్షిస్తున్నామని, అలాగే ప్రస్తుతం ఖైరతాబాద్, వనస్థలిపురంలో ఉన్న వెల్‌నెస్ సెంటర్లకు అదనంగా సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల్లో 12 వెల్‌నెస్ సెంటర్లను, అలాగే రాష్ట్ర వాప్తంగా ప్రతి జిల్లాకో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రాజీవ్ స్వగృహ పథకంలో ఇళ్లు, ఇతర రాష్ర్టాల మాదిరిగా ఆర్టీసీ బస్సులో 50 శాతం రాయితీ, జనవరి 2017కు గాను డియర్‌నెస్ రిలీఫ్‌ను మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్ కె. లక్ష్మయ్య, కార్యదర్శి జి. నర్సింహా,కో చైర్మన్ ఎం.సూర్యనారాయణ, వైస్ చైర్మన్ కె. సుశీలాదేవీ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ జి. మానయ్య, డి. హరికుమారి, కార్యదర్శులు ఎస్. జ్ఞానేశ్వర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

248
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...