కేసీఆర్ తెలంగాణకు సీఎం కావటం వరం


Fri,April 21, 2017 12:40 AM

టీఎస్‌సీఏబీ చైర్మన్ రవీందర్ రావు
ఖైరతాబాద్ : ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం ఇక్కడి ప్రజలకు వరం వంటిదని తెలంగాణ స్టేట్ కోఆపరేటీవ్ అపెక్స్ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. వరంగల్ బహిరంగ సభ, ప్లీనరీల విజయవంతమే లక్ష్యంగా చేపడుతున్న గులాబీ కూలీ పనిలో భాగంగా గురువారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో రవీందర్ రావు స్థానిక కార్పొరేటర్ పి. విజయా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పంజాగుట్టలోని పాలెం లెదర్స్‌లో పని చేయడంతో పాటు సూట్ కేసులను విక్రయించడం ద్వారా రూ.1.50లక్షల కూలీ తీసుకున్నారు.

ఈ మేరకు పాలెం లెదర్స్ అధినేత పాలెం శ్రీనివాస్ రెడ్డి, కాంట్రాక్టర్ వెంకటేశ్ వర్మ చేతుల మీదుగా చెక్కును అందుకున్నారు. అనంతరం రవీందర్ రావు విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు స్వచ్ఛంధంగా గులాబీ కూలీలో పాల్గొంటున్నారని, టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల అభిమానంతో ప్రజలు తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వ మూడేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టినవి, పెట్టని సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించారన్నారు. కార్పొరేటర్ విజయా రెడ్డి మాట్లాడుతూ ప్రతి నేత కూలీ పని చేస్తూ డబ్బులు సంపాదించి ప్లీనరీ విజయవంతానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్లీనరీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలు ఆశీర్వాదంలా తమకు సహకారం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మోహన్ యాదవ్, వెంకట్ రెడ్డి, ఆనంద్, దీపక్ రెడ్డి, నరేశ్, రాజ్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

414
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...