ఏపీ ముఖ్యమంత్రులు మా జీవితాలతో ఆడుకున్నారు


Fri,April 21, 2017 12:39 AM

-తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి
-1998 డీఎస్సీ అభ్యర్థుల వేడుకోలు

ఖైరతాబాద్: 1998లో డీఎస్సీకి క్వాలీఫై అయినా ఏపీ ముఖ్యమంత్రులు ఉద్యోగాలు కల్పించకుండా తమ జీవితాలతో ఆడుకున్నారని తెలంగాణ డీఎస్సీ 98 క్వాలీఫైడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు బి. నర్సింహా రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ గురువారం తమ గోడును వెల్లబోసుకున్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరిగిందని, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు జరిగిన అన్యాయంపై అప్పటి విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఐవీ సుబ్బారావుతో హైలెవల్ కమిటీ వేసిందన్నారు. ఆ కమిటీ అన్ని జిల్లాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిం అన్యాయం జరిగినట్లు నిర్ధారించిందన్నారు.

ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నాన్ లోకల్ కోటా మించి ఉద్యోగాలు ఇచ్చారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని, 16 ఏళ్ల సర్వీసులు అవసరం లేదని, అన్ని అర్హత సాధించి క్వాలీఫై అయిన తమకు మానవతా దృక్పదంతో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్వి జి. రామకిషన్, కార్యదర్శి శ్రీపతి రావు, ఉపాధ్యక్షుడు బి. వెంకన్న, పి. సంజీవ రావు, పి. సత్యనారాయణ, వై. నాగేందర్ గౌడ్, ఎల్. జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

607
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...