ఇంటి పర్మిషన్లు..ఈజీ


Tue,March 21, 2017 02:00 AM

-ఆర్కిటెక్ట్‌తో పనిలేదు
-స్వీయ దరఖాస్తుతో అనుమతులు
-ముందుగా నివాస భవనాలకు వర్తింపు
-ఇండోర్ తరహా పద్ధతిపై అధికారుల మొగ్గు
-త్వరలో అమలుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ;ఇంటి అనుమతి తీసుకోవాలంటే తప్పనిసరిగా లైసెన్సుడ్ ఆర్కిటెక్ట్‌తో నమూనా తయారు చేయించాలి. ఈ పద్ధతిలో కొన్నిసార్లు అధికారులు, ఆర్కిటెక్ట్‌లు కుమ్మక్కై అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ప్రక్రియలో సమూల మార్పులకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండోర్ నగరంలో ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని మన దగ్గర కూడా అవలంభించాలని యోచిస్తున్నారు. దీని ప్రకారం దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన నమూనాను ఎంచుకొని, నిర్ణీత ప్రొఫార్మా పూర్తి చేస్తే చాలు..అనుమతి ఇచ్చేస్తారు. త్వరలో నివాస భవనాలకు ఈ పద్ధతి ఆచరణలోకి తెస్తామని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సుల్లో అక్రమాల నివారణకు సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు గానే ఇంటి అనుమతుల్లో సైతం ఆన్‌లైన్ విధా నాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. సహ జంగా ప్లాటు సైజు, ప్లాటు ఎదుట ఉన్న రోడ్డు వెడల్పు, ప్రాంతం(నివాస లేక వాణిజ్య) తదితర అంశాలపైనే ఇంటి అనుమతులు ఆధారపడి ఉంటాయి. దీని ఆధారంగానే సెట్‌బ్యాక్స్, ఎత్తు తదితర ఇంటి నమూనా రూపొందించాల్సి ఉం టుంది. ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా సాఫ్ట్‌వేర్ తిరస్కరిస్తుంది.

లైసెన్డ్ ఆర్కిటెక్ట్‌లు దరఖాస్తు దారుల వద్ద ఫీజు తీసుకొని నిబంధనల ప్రకారం నమూనా రూపొందించి దరఖాస్తు చేస్తారు. ఒక్కో సారి వారు కూడా పొరపాట్లు చేయడం వల్ల దరఖాస్తులు తిరస్కారానికి గురవుతున్నాయి. ఏదిఏమైనా దరఖాస్తుదారుడు ఆర్కిటెక్ట్‌లతో సంబంధం లేకుండా స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రస్తుత విధానంలో లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని అవినీతి అధికారులు, ఆర్కిటెక్ట్‌లు కుమ్మక్కై అక్రమాలను ప్రోత్సహి స్తున్నారు. ఫీజులు తీసుకొని నమూనాలు రూపొందించాల్సింది పోయి అధికారుల అండతో పరోక్షంగా అక్రమ నిర్మాణాలు ఏర్పాటయ్యేలా చేస్తున్నారు.

ఉదాహరణకు సుమారు 300గజాల స్థలంలో గ్రౌండ్+3కి అనుమతులు జారీ అయ్యే అవకాశం ఉండగా, వీరు అమ్యామ్యాలు దండు కొని ఐదు అంతస్తుల వరకు నిర్మించేలా అవకాశం కల్పిస్తున్నారు. తరువాత ఎలాగూ క్రమబద్ధీకరణ పథకం వస్తుందని, అప్పుడు తామే క్రమబద్ధీక రిస్తామని నమ్మబలకడంతో దరఖాస్తుదారులు అనుమతులు తీసుకోవడానికి బదులు అక్రమ నిర్మాణాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల అటు అధికారులు, ఇటు ఆర్కిటెక్ట్‌లకు పుష్క లంగా అమ్యామ్యాలు అందడమే కాకుండా దరఖాస్తుదారులకు సైతం అనుకున్న దానికన్నా మెరుగైన రీతిలో ఇల్లు నిర్మించుకునే వీలు కలుగుతుంది.

ఇటీవల గచ్చిబౌలిలో ఓ వ్యక్తి తన 300 గజాల ప్లాటులో ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకునేందుకు ఆర్కిటెక్ట్ వద్దకు వెళ్లగా, సదరు ఆర్కిటెక్ట్ పైన పేర్కొన్న విధంగా సలహా ఇవ్వ డంతో సదరు వ్యక్తి ఏమి చేయాలో అర్థంకాక తల పట్టుకు న్నాడు. నగరంలో అక్రమ నిర్మాణాలు జరిగేం దుకు ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

2008లో ప్రవేశపెట్టిన క్రమబద్ధీకరణ పథకానికి 2.05లక్షల దరఖాస్తులు రాగా, తాజాగా మళ్లీ 1.75వరకు దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. దీన్నిబట్టి దశాబ్ధ కాలంలో సుమారు నాలుగు లక్షల అక్రమ నిర్మా ణాలు జరిగాయంటే ఇవన్నీ అధికారులకు తెలియ కుండా జరిగాయ నడంలో అతిశయోక్తి లేదు.

నమూనాలు అధికారులే రూపొందించి...
ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుడే స్వయంగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వెసలుబాటు కల్పిస్తే అక్రమాలు తగ్గే వీలుంటుందని అధికా రులు భావిస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్ లోనే రోడ్డు వెడల్పు, దిక్కులు, ప్లాటు సైజు తదితర వివరాలు నమోదు చేయగానే పలు విధాల ఇంటి నమూ నాలు కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే విధంగా ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేయాలని నిరయించారు.

ఉన్న నమూనాల్లో తమకు నచ్చిన నమూనాను ఎంపికచేసుకొని దరఖాస్తుతో పాటు వాటిని సమర్పిస్తే సరిపో తుంది. ఈ నమూనాలు అధికారులే రూపొం దించి ఆన్‌లైన్‌లో ఉంచుతున్నందున వాటిని ఆర్కిటెక్ట్‌లు ధృవీకరించాల్సిన ఆవశ్యకత ఉండదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఇదే తరహా విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు అధికా రులు తెలిపారు.

త్వరలోనే అందుబాటులోకి..


ముఖ్యంగా వాణిజ్య భవనాలకు ఇంటీరియర్ డిజైనింగ్ వంటివి ఉంటాయి కనుక ఆర్కిటెక్ట్‌ల సేవలు తప్పనిసరవుతాయి. అంతేకాకుండా వాణి జ్య భవనాల దరఖాస్తుల పరిశీలన అనేక దశల్లో ఉంటుంది. అందుకే ముందుగా నివాస భవనా లకు మాత్రమే స్వీయ దరఖాస్తు విధాన్ని ప్రవే శపెట్టాలని భావిస్తున్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే ప్రజలకు అందు బాటులోకి తెస్తాం. అని జీహెచ్ ఎంసీ ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి తెలిపారు.

780
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS