మూడో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం


Sun,November 17, 2019 12:13 AM

-తీవ్రంగా గాయపడిన విద్యార్థి
కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 16 : విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టార్లు శృతిమించిపోతున్నారు. సహనంగా, ఓపికగా ఉంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్లో అసహనం పెరిగిపోతోంది. ఫలితంగా విద్యార్థులు పంతుళ్ల చేతుల్లో తీవ్రంగా గాయాలపాలవుతున్నారు. శనివారం పట్టణంలోని బూడిదగడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి దాష్టీకానికి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థి తల్లి, తోటి విద్యార్థులు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలో గౌతంనగర్‌కు చెందిన గొగ్గెళ్ల సందేష్ మూడవ తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో పాఠశాల ఆవరణలో ఐదవ తరగతి విద్యార్థితో మాట్లాడుతుండగా ఈ సమయంలో పాఠశాల ఉపాధ్యాయుడు మలిరాం గాంధీ విద్యార్థి సందేష్‌ను చూసి సహనం కోల్పోయి విచక్షణ రహితంగా కాలితో తన్నడంతో సందేష్ పక్కనే ఉన్న బండరాయిపై పడి తలకు తీవ్రంగా గాయమై రక్తం కారిందని, దీంతో బెదిరిపోయిన ఉపాధ్యాయుడు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడని వారు తెలిపారు. విద్యార్థి తలపై, కంటిచుట్టుపక్కల గాయమై ఐదు కుట్లు పడ్డాయి. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రధానోపాధ్యాయురాలిని వివరణ తెలుసుకునేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles