సాఫీగా గమ్యస్థానాలకు..


Sat,November 16, 2019 12:18 AM

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ జాక్ సమ్మె చేస్తున్నప్పటికీ ప్రయాణికులు తాము చేరాల్సిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటున్నారు. శుక్రవారం సమ్మె పిలుపులో భాగంగా ఆర్టీసీ జాక్ నాయకులు డిపోల నుంచి బస్సులను బయటకు రానీయకుండా కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. అనంతరం నోడల్ ఆఫీసర్ల ఆదేశాలతో ఆర్టీసీ, పోలీస్, రవాణాశాఖాధికారుల సమన్వయంతో బస్సులను యథావిధిగా నడిపించారు. గంటపాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డప్పటికీ ఆర్టీసీ అధికారులు బస్సులను నడపడంతో తమతమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నారు.


బస్సుల్లో పెరిగిన ప్రయాణికులు..
జిల్లాలోని మూడు డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులను నడిపారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లే కాకుండా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు, రాజధాని ఏసీ బస్సులను సైతం నడిపారు. భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, ఖమ్మం, హైదరాబాద్, మిర్యాలగూడ, విజయవాడ, వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాలకు బస్సులు తిరిగాయి. కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశాల మేరకు కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోలకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు బస్సుల రూట్లను పర్యవేక్షిస్తూ డ్రైవర్లకు, కండక్టర్లకు సూచనలు చేశారు. ఆర్టీసీ డీవీఎం వేములవాడ శ్రీకృష్ణ, మూడు డిపోల మేనేజర్లు, ఎస్సీ సునీల్ దత్ ఆదేశాలతో కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం.ఆలీ, సీఐలు సత్యనారాయణ, ఎల్.రాజు, జిల్లా రవాణాశాఖాధికారి రవీందర్ అధికారులు డ్రైవర్లకు సూచనలు చేస్తూ బాధ్యతగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.

జిల్లాలో రోడ్డెక్కిన బస్సులు..
మూడు డిపోలలో మొత్తం ఆర్టీసీ, హైర్ బస్సులు 268 బస్సులు ఉండగా, 204 బస్సులు శుక్రవారం నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొత్తగూడెం డిపోలో 65బస్సులు ఉండగా 31బస్సులు, భద్రాచలం డిపోలో 81 బస్సులు ఉండగా 60బస్సులు, మణుగూరు డిపోలో51బస్సులు ఉండగా 51బస్సులు నడుపారు. హైర్‌బస్సుల విషయానికి వస్తే కొత్తగూడెంలో 22 బస్సులకుగాను 20, భద్రాచలంలో 25బస్సులకు గాను 21, మణుగూరు డిపోలో 21బస్సులకు 21బస్సు సర్వీసులను నడిపామని చెప్పారు. మొత్తంగా 90శాతంపైగా బస్సులను జిల్లా వ్యాప్తంగా నడిపినట్లు అధికారులు తెలిపారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles