లైంగికదాడికి పాల్పడిన నిందితుల అరెస్ట్..


Sat,November 16, 2019 12:16 AM

మణుగూరు రూరల్: మణుగూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మైనర్ బాలికపై గత నెలలో లైంగికదాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మణుగూరు డీఎస్పీ బీ రామానుజం తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో ఇద్దరు నిందితులు పరారీ ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 27వ తేదీన బాధిత బాలిక తల్లికి పరిచయస్తుడైన దుమ్ముగూడెం మండలం రామారావుపేట గ్రామానికి చెందిన పూజారి కల్యాణ్ భద్రాచలంలో బాలికను ద్విచక్ర వాహనంపై తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెను లోబర్చుకున్నాడు. 28వ తేదీన బాలికను కల్యాణ్ ద్విచక్ర వాహనంపై భద్రాచలంలో దింపడంతో బాలిక బస్‌లో మణుగూరు చేరుకుంది.


ఆమె ఇంటికి వెళ్లకుండా తన చిన్న నానమ్మ గ్రామమైన గంగోలు వెళ్లడానికి నిశ్చయించుకొని మణుగురులోని సాయిబాబా గుడి వద్ద మణుగూరుకు చెందిన ముత్తారపు వెంకటేశ్ ఆటో ఎక్కి భద్రాచలం వెళ్లింది. ఆటో డ్రైవర్ వెంకటేశ్ ఆమెను గంగోలులో దింపుతానని మభ్యపెట్టి సారపాక సమీపంలోని రెడ్డిపాలెం వద్ద ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటికే అదే ప్రాంతంలో ఉన్న సందెళ్ల రామాపురం గ్రామానికి చెందిన సోడె రాంబాబు అలియాస్ బాబు, పొడియం సాయి, తెల్లం కృష్ణ, ఆంతోటి ప్రశాంత్, వినయ్ తదితరులు వారిని బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మణుగూరు సీఐ ఎంఏ షుకూర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగికదాడికి పాల్పడిన నిందితులు కల్యాణ్, ప్రశాంత్, సాయి, రాంబాబు, ఆటో డ్రైవర్ వెంకటేశ్, వనమోజు సంతోష్‌కుమార్‌లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రామానుజం తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కృష్ణ, వినయ్‌లు పరారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులు ఉపయోగించిన ఆటోను, ద్విచక్ర వాహనంను స్వాదీం చేసుకున్నారు. సమావేశంలో సీఐ ఎంఏ షుకూర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles