అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత


Sat,November 16, 2019 12:16 AM

బూర్గంపహాడ్, నవంబర్ 15: అక్రమంగా రవాణ చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకొని, నిందితుడిని అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాల్వంచ సీఐ నవీన్ పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం మోరంపల్లిబంజర చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, గంజాయి తరలిస్తున్న వాహనంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. భూక్యా వెంకటేష్ అనే వ్యక్తి కారులో అనుమానస్పదంగా కనిపించగా, ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో సుమారు ఐదు కేజీల గంజాయి బస్తాలో ఉన్నట్లు గుర్తించామన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా, ఒరిస్సా రాష్ట్రం కుంట ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తుంటామని నిందితుడు తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు. గంజాయిని, కారును బూర్గంపహాడ్ అగ్రికల్చర్ అధికారి, వీఆర్‌వోల సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంజాయి విలువ రూ.72వేలు ఉంటుందన్నారు. సమావేశంలో బూర్గంపహాడ్ ఎస్సై బొమ్మెర బాలకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles