బాల నాట్య మయూరి గోమతికి


Sat,November 16, 2019 12:15 AM

-మాజీ ఎంపీ పొంగులేటి సన్మానం
ఖమ్మం, నమస్తే తెలంగాణ: కూచిపూడి నాట్యంలో విశేషంగా రాణిస్తున్న చిన్నారి దూబగుంట్ల గోమతిని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్మానించారు. ఇటీవల మధిర, వరంగల్‌లో జరిగిన బాలోత్సవ్‌లో సంప్రదాయ, జానపద నృత్యాలలో గోమతి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డిని కుటుంబ సభ్యులతో కలిసింది. గోమతి సాధించిన అవార్డులు, రివార్డులు, క్లాసికల్, ఫోక్ డ్యాన్స్‌లో రాణిస్తున్న తీరును ఆమె తల్లి గాయత్రి మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డికి వివరించారు. ఈ ఏడాది జిల్లాస్థాయిలో ఉత్తమ కళాకారిణిగా కూడా ఎంపికైనట్లు తెలిపారు. ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గోమతి ఏటూరి మీనా నృత్యాలయంలో శిక్షణ పొందుతోందని తెలిపారు. జాతీయస్థాయిలో అవార్డులు సాధించినా మరింత ముందుకు వెళ్లేందుకు సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరారు. అందుకు పొంగులేటి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇటీవల గోమతి సాధించిన అవార్డులు, రివార్డులను ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ప్రదర్శించారు. వాటిని తిలకించిన పొంగులేటి చిన్నారిని సన్మానించి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోమతి సోదరుడు హృతిక్‌సాయి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles