నిరంతరం రవాణా సేవలు..


Fri,November 15, 2019 03:25 AM

-పరుగాపని ఆర్టీసీ చక్రంరోడ్డెక్కిన 227 బస్సులు సులువుగా గమ్యస్థానాలకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఎస్ ఆర్టీసీ జాక్ నాయకులు తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రభావం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ యజమాన్యం చేపట్టిన చర్యలతో సమ్మె తాలుకు ప్రభావం కనిపించలేదు. గురువారం 41వ రోజు ఆర్టీసీ జాక్ నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె కొనసాగించినప్పటికీ యథావిధిగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను ఆపరేట్ చేసింది. మొత్తంగా మూడు డిపోలో కలిపి డిపో, హైర్ బస్సులు కలిపి 227 బస్సులను నడిపింది. కొత్తగూడెం డిపో పరిధిలో 51 డిపో, 19 హైర్ బస్సులు, మణుగూరు డిపో పరిధిలో 52 డిపో, 19 హైర్, భద్రాచలం డిపో పరిధిలో 65 డిపో, 21 హైర్ బస్సులు నడిచాయి. మొత్తంగా మూడు డిపోల పరిధిలో 227 బస్సులు నడిచాయి.


యథావిధిగా తిరిగిన సర్వీసులు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు డిపోల పరిధిలో గురువారం ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. మూడు డిపోలకు కలిపి మొత్తం 227 బస్సులను అధికారులు నడిపించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రాలోని విజయవాడ, గుంటూరు, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు హైర్‌బస్సు సర్వీసులు కూడా అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్ ప్రాంగణాలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఇల్లెందు, మణుగూరు, ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు బస్సులను నడిపారు.

సాఫీగా సాగిన ప్రయాణాలు
జాక్ నాయకులు సమ్మె దిగుతామని ప్రకటించడంతో ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కార్మికులు సమ్మె చేసినప్పటికీ ప్రయాణికులు సమ్మె ప్రారంభం నుంచి ఎక్కడా ఇబ్బందిపడినట్లుగా కనిపించలేదు. పోలీస్, రవాణశాఖా సిబ్బంది, ఆర్టీసీ ఉన్నతాధికారుల సూచనలతో ముందస్తుగా నిర్ణయించిన రూట్లలో బస్సులను నడిపారు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నప్పటికీ ఎక్కడా ఏ చిన్న సంఘటన కూడా జరగకపోవడం పట్ల ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles