ఘనంగా బాలల దినోత్సవ సంబురాలు


Fri,November 15, 2019 03:24 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవం సంబురాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో బాలబాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటల్లో పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బాలల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆటపాటల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవితంలో తిరిగిరానిది బాల్యమేనని, అటువంటి బాల్యంలోనే సరైన పునాది వేసి బాలబాలికలను బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహనీయుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు పుణికిపుచ్చుకొని గొప్ప పౌరులుగా ఎదగాలన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, సూర్యోదయ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత పోటీ తత్వాన్ని, విద్యార్థుల ఆలోచనా దృక్పథాన్ని నేటి తరానికి అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తే వారిలో మంచి ఎదుగుదల ఉంటుందని అన్నారు. ఈసందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అన్ని మండల కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల విద్యాశాఖాధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బాలబాలికలు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles