సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి


Wed,November 13, 2019 11:53 PM

కొత్తగూడెం క్రైం: సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత కాలంలో నేరస్తులు సులభంగా డబ్బు సంపాదించడానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ సునీల్‌దత్ అన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో పీఎఫ్ ఖాతా ఉన్న వారికి బంపర్ ఆఫ్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెస్సేజ్‌ను ఎవరూ నమ్మవద్దన్నారు. ఇలాంటి మెసేజ్‌లను వార్తల రూపంలో మీడియాలో ప్రచారంలో చేస్తూ అమాయక ప్రజల నుంచి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఎన్నో విధాలుగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. పీఎఫ్ ఖాతా కలిగి ఉన్న అందరికీ ఈపీఎఫ్‌వో నుంచి రూ.80 వేలు ఆఫర్ అని ప్రచారం అయ్యే వార్తలను నమ్మి మోసపోవద్దన్నారు. ఈవార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్‌వో సంస్థ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చిందన్నారు. ఇలాంటి ఎన్నో రకాల ఆన్‌లైన్ లింక్స్, బ్యాంకు సిబ్బంది లాగా ఫోన్లు చేయడం ద్వారా నిత్యం చాలా మంది అమాయకులు సైబర్ నేరాలకు బలవుతున్నారని, జిల్లాలో సైబర్ నేరాలపై పోలీసుల ఆధ్వర్యంలో, కళాబృందం ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.


55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles