లైఫ్ సర్టిఫికెట్ కేంద్రం ప్రారంభం


Wed,November 13, 2019 11:52 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం పట్టణంలోని పాత ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుటగల తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ కార్యాలయంలో టీ యాప్ ఫోలియో ద్వారా లైఫ్ సర్టిఫికెట్ కేంద్రం బుధవారం ఏర్పాటైంది. దీనిని భద్రాచలం సబ్ ట్రజరీ అధికారి సైదులు ప్రారంభించారు. పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.... ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) తయారు చేసిందన్నారు. దీని టీ యాప్ ఫోలియోకు జత చేసిందని చెప్పారు. బయోమెట్రిక్ ఐడీ అథెంటికేషన్, ఫేసియల్, డెమోగ్రాఫిక్ అథెంటికేషన్, ఫక్షటో మిషన్ ద్వారా లోపాలకు ఆస్కారం లేకుండా ఆధునిక సాంకేతికతతో రూపొందించినట్లు తెలిపారు. పెన్షనర్లు యాప్‌లో ఐడీ నెంబర్ నిక్షిప్తం చేయడంతోపాటు ఫోటో దిగి ట్రజరీ అధికారికి పంపాలని కోరారు. పెన్షనర్లు కేంద్రానికి వచ్చేటప్పుడు ఓటరు ఐడీ కార్డు, బ్యాంక్ అకౌంట్, పెన్షన్ ఐడీ నెంబర్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, సుబ్బయ్యచౌదరి, రాధాకృష్ణ, నాగేశ్వరరావు, యాదగిరి, ఐవీవీ సత్యనారాయణ, కేఎస్‌ఎల్‌వీ ప్రసాద్, నాళం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles