రోడ్డెక్కిన 227 బస్సులు


Wed,November 13, 2019 02:29 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , నమస్తే తెలంగాణ: టీఎస్‌ ఆర్టీసీ జాక్‌ నాయకులు తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రభావం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ యజమాన్యం చేపట్టిన చర్యలు సమ్మె తాలుకా ప్రభావం కనిపించలేదు. మంగళవారం 39వ రోజు ఆర్టీసీ జాక్‌ నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె కొనసాగించినప్పటికీ యథావిధిగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను ఆపరేట్‌ చేసింది. వరుసగా రెండురోజులు సెలవులు రావడం, దీనికి తోడుగా మంగళవారం కార్తీకపౌర్ణమి శుభసందర్భం ఉండటంతో ఉద్యోగస్తులు తమ తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు. మొత్తంగా మూడు డిపోల్లో కలిపి డిపో, హైర్‌ బస్సులు 227 బస్సులను నడిపింది. కొత్తగూడెం డిపో పరిధిలో 50డిపో బస్సులు, 21 హైర్‌ బస్సులు, మణుగూరు డిపో పరిధిలో 51 డిపో బస్సులు, 20 హైర్‌ బస్సులు, భద్రాచలం డిపో పరిధిలో 64 డిపో బస్సులు, 20 హైర్‌ బస్సులు నడిచాయి. మొత్తంగా మూడు డిపోల పరిధిలో 227 బస్సులు నడిచాయి.


ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు..
జిల్లావ్యాప్తంగా ఉన్న మూడు డిపోల పరిధిలో సోమవారం బస్సులను ఎక్కువగా నడిపించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. హైదరాబాద్‌ లాంటి ప్రాంతానికే రాత్రి వేళల్లో ప్రయాణికుల సందడి బస్టాండ్లలో కనిపిస్తుంది కానీ అందుకు భిన్నంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్‌ ప్రాంగణాలు ప్రయాణికులతో నిండిపోయాయి. కార్తీకమాసం సందర్భంగా గోదావరి పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారి కోసం రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో సైతం భద్రాచలానికి ఎక్కువగా ఆపరేట్‌ చేసింది. వివాహాలు, గృహప్రవేశాలకు ముహూర్తం ఉండటం, ఇతరత్రా శుభకార్యాలు ఉండటంతో మూడు డిపోలలో బస్సులను ప్రయాణికులకు సరిపడా బస్సులు నడిపించారు.ఇల్లెందు, మణుగూరు, ఖమ్మం, హైదరాబాద్‌, విజయవాడ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు యథావిధిగా నడిపారు.

ఇబ్బందులు లేకుండా
సాఫీగా సాగిన ప్రయాణాలు
జాక్‌ నాయకులు సమ్మె దిగుతామని ప్రకటించడంతో ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలను ఇచ్చింది. కార్మికులు సమ్మె చేసినప్పటికీ ప్రయాణీకులు సమ్మె ప్రారంభం నుంచి ఎక్కడా ఇబ్బందిపడినట్లుగా కనిపించలేదు. పోలీస్‌, రవాణశాఖా సిబ్బంది, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సూచనలతో ముందస్తుగా నిర్ణయించిన రూట్లలో బస్సులను నడిపారు. ప్రయాణీకులు ఎప్పటికప్పుడు బస్సు రూట్లను ఆర్టీసీ అధికారులు ప్రయాణీకులకు చెబుతుండటంతో ఆయా బస్సులలో ప్రయాణించి సాఫీగా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రైవేట్‌ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నప్పటికీ ఎక్కడా ఏ చిన్న సంఘటన కూడా జరగకపోవడం పట్ల ఆర్టీసీ అధికారులపై ప్రయాణీకులపై మరింత నమ్మకం పెరిగింది.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles