5లక్షల టన్నుల బొగ్గు సరఫరా


Wed,November 13, 2019 02:29 AM

మణుగూరు, నమస్తేతెలంగాణ: భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(బీటీపీఎస్‌)లో విద్యుత్‌ ఉత్పత్తి కోసం 2019-20 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 5లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనుంది. మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా జరిగేందుకు కేంద్ర పర్యావరణశాఖ ఇప్పటికే ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందు కోసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. రెండు ఏజేన్సీల ద్వారా కోల్‌ను ట్రాన్స్‌ పోర్టు కానుంది. మణుగూరు ఏరియా పీకేఓసీ-2, మణుగూరు ఓసీ నుంచి జీ-9 గ్రేడ్‌ బొగ్గును డిసెంబర్‌ నెల నుంచి కోల్‌ ట్రాన్స్‌ పోర్టు కానుంది. ఇప్పటికే బీటీపీఎస్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేలా పక్కా ప్రణాళికతో పనులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ నెలలో యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తి కోసం సీవోడీ చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. అదేవిధంగా యూనిట్‌-2లో సింక్రనైజేషన్‌ను, యూనిట్‌-3లోలైటప్‌, 4లో హైడ్రో టెస్ట్‌ నిర్వహించనున్నట్లు జెన్కో అధికారులు తెలియజేస్తున్నారు. అన్ని యూనిట్ల నుంచి వచ్చే మార్చి కల్లా విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇందుకు గాను బీటీపీఎస్‌కు 5లక్షల టన్నుల బొగ్గు అసవరం ఉంది. ప్రతి రోజు సుమారు 13 వేల టన్నుల బొగ్గు లారీల ద్వారా రవాణా జరగనుంది.


మణుగూరు ఏరియాలో రెండు గనుల నుంచే కోల్‌ ట్రాన్స్‌ పోర్టు..
మణుగూరు, పినపాక మండలాల్లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1080 మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌కు 2019-20 ఆర్ధిక సంవత్పరానికి రోడ్డ మార్గం ద్వారా జరగనున్న 5లక్షల టన్నుల బొగ్గును మణుగూరు ఏరియా పీకేఓసీ-2, మణుగూరు ఓసీల నుంచి మాత్రమే జీ-9 గ్రేడ్‌ కోల్‌ ట్రాన్స్‌ పోర్టు జరగనుంది. మణుగూరు ఓసీ, పీకేఓసీలో మాత్రమే జీ-9 గ్రేడ్‌ బొగ్గు ఉత్పత్తి అవుతోంది. మణుగూరు ఏరియాలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో సంస్థ నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 95 లక్షల టన్నులు. సమిష్టి కృషితో నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ఏరియా జీఎం జక్కం రమేష్‌ ఆధ్వర్యంలో ఏరియా అధికారులు, ఉద్యోగులు పక్కా ప్రణాళికతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.

డిసెంబర్‌ నుంచి కోల్‌ ట్రాన్స్‌పోర్టు ప్రారంభిస్తాం..: బీటీపీఎస్‌ సీఈ
మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు డిసెంబర్‌ నెల నుంచి కోల్‌ ట్రాన్స్‌ పోర్టు ప్రారంభిస్తాం. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 5 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసుకుంటాం. మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా జరిగేందకు కేంద్ర పర్యావరణశాఖ కూడా అనుమతి వచ్చింది. రెండు ఏజెన్సీల నుంచి ప్లాంట్‌కు కోల్‌ ట్రాన్స్‌పోర్టు జరగనుంది. ఇందుకు తగ్గట్టుగానే ప్లాంట్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు ట్రాన్స్‌ పోర్టు అయ్యే మార్గంలో పర్యావరణ పరిరక్షణకు తప్పని సరిగా చర్యలు తీసుకుంటాం.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles