ముగిసిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు


Wed,November 13, 2019 02:29 AM

నేలకొండపల్లి: పాలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలు ఏది అడిగితే ఆపనిని నా శక్తి ఉన్నంత మేరకు చేసిపెట్టానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఎద్దుల బల ప్రదర్శన పోటీల ముగింపు సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఖమ్మం నుంచి వచ్చిన మాజీమంత్రి తుమ్మలకు గువ్వలగూడెం గ్రామంలో పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో నేలకొండపల్లి మీదుగా రాజేశ్వరపురం చేరుకున్నారు. రాజేశ్వరపురంలో ఎడ్లబండిపై తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంలో రెండున్నర సంవత్సరాలు మంత్రిగా తనను ఎంతో ఆదరించారని తెలిపారు. నియోజకవర్గం ప్రజల కోసం రహదారుల నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు, పాతకాలువ నిర్మాణం, కళాశాలల భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. పవిత్ర కార్తీకపౌర్ణమి రోజున రాజేశ్వరపురం రావాలని కోరడంతో మీఅందరి కోసం వచ్చానని, ప్రజల అప్యాయతను, అనుబంధాల, అనురాగాన్ని పురస్కరించుకొని పండుగను ఘనంగా చేసుకోవాలన్నారు. అనంతరం ఎద్దుల బల ప్రదర్శన పోటీలను తుమ్మల నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.


ఖమ్మం మేయర్‌ గుగులోతు పాపాలాల్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, డాల్డా చైర్మన్‌ కొర్లకుంట నాగేశ్వరరావు, సర్పంచ్‌ దండా పుల్లయ్య, సొసైటీ చైర్మన్‌ దండాప్రవీణ్‌కుమార్‌, ఎంపీటీసీ జటంగి చంద్రమ్మ, సాధు రమేష్‌రెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, నెల్లూరి భద్రయ్య, సర్పంచ్‌లు వల్లాల రాధాకృష్ణ, మస్తాన్‌, పార్టీ మండల అధ్యక్షుడు వెన్నపూసల సీతారాములు, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ శాకమూరి రమేష్‌, నల్లాని మల్లికార్జున్‌, బండారు విశ్వనాథం, గెల్లా జగన్‌మోహన్‌రావు, మైసా శంకర్‌, కొత్త సత్యనారాయణ, రాయపూడి శ్రీనివాసరావు, కాసాని నాగేశ్వరరావు, కడియాల నరేష్‌, దండా రంగయ్య, తన్నీరు కృష్ణమూర్తి, ఎర్రబోయిన నర్సయ్య, బోనగిరి కిరణ్‌, పోలంపల్లి ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles