పామాయిల్ సాగులో సమస్యలు లేకుండా చూడాలి


Tue,November 12, 2019 03:17 AM

-టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్‌కు మాజీ మంత్రి తుమ్మల సూచన
దమ్మపేట, నవంబర్ 11 : పామాయిల్ సాగుచేస్తున్న రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన చేశారు. సోమవారం మండల పరిధిలోని గండుగులపల్లి తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మన్ రామకృష్ణారెడ్డితో తుమ్మల కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కువగా పామాయిల్‌ను రైతులు సాగుచేస్తున్నారని, ఆయిల్‌ఫెడ్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, పామాయిల్ మొక్కలు, ఎరువులు, రైతులకు పామాయిల్ ద్వారా వచ్చే నగదును సకాలంలో అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పామాయిల్ ధర రైతులకు అనుగుణంగా నిర్ణయించాలన్నారు.


అప్పారావుపేటలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేపట్టిన ఫ్యాక్టరీలో వచ్చిన శాతంతోనే ధర నిర్ణయం చేస్తారని, ఆయిల్ శాతం ఎంత పెరిగితే రైతులకు అంత ధర కలిసివస్తుందని తుమ్మల అన్నారు. పామాయిల్ ధరలో తెలంగాణదే పైచేయి అని తెలిపారు. అనంతరం తుమ్మల వారితో తేనేటి విందులో పాల్గొన్నారు. తుమ్మలను కలిసిన వారిలో ఏరియా కో-ఆర్డినేటర్ ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు కోటగిరి బుజ్జిబాబు, కాసాని నాగప్రసాద్ తదితరులు ఉన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles