భద్రాచలం, నమస్తే తెలంగాణ నవంబర్ 11 : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాలో పర్యటన సందర్భంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు సంక్షిప్త సమాచారంతో యూనిట్ అధికారులు సిద్ధంగా ఉండాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఐటీడీఏ పీవో ఛాంబర్లో తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల వారీగా పీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూనిట్ అధికారులకు సూచనలు ఇస్తూ మంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని తెలిపారు.
విద్య, వైద్యం, ఇంజనీరింగ్, గురుకులం, జీసీసీ, ఆర్వోఎఫ్ఆర్, ట్రైకార్ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను రివ్యూ సమావేశంలో మంత్రి అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సవివరంగా వివరించాలని అధికారులకు సూచించారు. సంబంధిత ఐటీడీఏ యూనిట్ అధికారులు సమన్వయంతో పనిచేసి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావు, డీడీ జహీరుద్దీన్, ఇంజనీరింగ్ ఈఈ రాములు, మేనేజర్ సురేందర్, ఏవో భీమ్, ఎస్వో సురేష్‌బాబు, ఏడీఎం అండ్ హెచ్‌వో శ్రీనివాసులు, ఏపీవో పవర్ అనురాధ, ఏడీ అగ్రికల్చర్ సుజాత, గురుకులం బురాన్, డీటీఆర్వోఎఫ్ఆర్ శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ, ఎల్టీఆర్ నరేష్, ఎస్డీసీ విభాగం డీటీ రాజారావు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.