నేడు, రేపు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన


Tue,November 12, 2019 03:17 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, నమస్తే తెలంగాణ : రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ మంగళ, బుధవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటలకు సోమాజిగూడ నుంచి బయల్దేరి 9.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంటారు. 10.30 గంటలకు కురవి నుంచి కందికొండ టెంపుల్‌ను దర్శించుకొని మధ్యాహ్నం 2 గంటలకు భద్రాచలం రోడ్ ఐటీసీ అతిథి గృహంలో బస చేస్తారు. ఈ నెల 13న ఉదయం 8.30 గంటలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం 10 గంటలకు ఐటీడీఏ అధికారులతో సమావేశమవుతారు. 11.30 గంటలకు భద్రాచలంలో నూతనంగా నిర్మించిన బాలుర పోస్టు మెట్రిక్ వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. 12 గంటలకు మణుగూరులోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్‌ను, ఒంటి గంటకు కొత్తగూడెంలోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవనాలను, 3 గంటలకు ఇల్లెందులో బాలికల ఆశ్రమపాఠశాల అదనపు తరగతుల భవనాన్ని, 4 గంటలకు సింగరేణి మండలం బాలుర రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles