తాలిపేరుకు జలకళ


Tue,November 12, 2019 03:16 AM

చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలకళను సంతరించుకొంది. 74 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 73.91 మీటర్ల వద్దకు చేరుకుంది. తాలిపేరు జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. డ్యామ్‌లో ఎటుచూసినా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. జలాశయం నిండిన నేపథ్యంలో యాసంగికి ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 595 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు తాలిపేరు ప్రాజెక్టు డీఈఈ తిరుపతి తెలిపారు. ప్రస్తుతం రైతులు యాసంగి సాగుకు నాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్‌లో ఈ ఏడాది ప్రాజెక్టు కింద సుమారు 25 వేల ఎకరాల్లో వరి సాగైంది. ఆయకట్టుని మూడు జోన్లుగా విభజించి ఒక్కో ఏడాది ఒక్కోజోన్ ఆయకట్టుకు వేసవి (ఆరుతడి) పంటలకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించగా రొటేషన్ ప్రకారం ఈ వేసవిలో మొదటి జోన్ (చర్ల మండలం) కింద భూములకు సాగునీరు విడుదల చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.-చర్ల రూరల్

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles