బీట్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ


Mon,November 11, 2019 01:51 AM

-ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. ప్రసాదరావు
మణుగూరు, నమస్తే తెలంగాణ, నవంబర్ 10 : ఈ నెల 11నుంచి 16 వరకు మణుగూరు డివిజన్ ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా పైలట్ కాలనీ ఎంవీటీసీ కార్యాలయంలో కొత్తగా ఉద్యోగం పొందిన బీట్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు మణుగూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జీ. ప్రసాదరావు తెలిపారు. ఆయన ఆదివారం మణుగూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మణుగూరు ఫారెస్ట్ డివిజన్‌లో 35 మంది, భద్రాచలం ఫారెస్ట్ డివిజన్‌లో 6 గురు మొత్తం 41 మందికి కొత్తగా బీట్ ఆఫీసర్లుగా ఉద్యోగం వచ్చిందన్నారు. ప్రత్యేకంగా ప్రాథమిక అవగాహన కోసం 41 మంది శిక్షణ పొందనున్నారన్నారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.


ఈ శిక్షణ తరగతులను 11వ తారీకు ఉదయం 9 గంటలకు కంన్జర్వేటర్ పి.రాజారావు, డీఎఫ్‌వో ఎస్ రాంబాబులు ప్రారంభిస్తారన్నారు అనుభవజ్ఞులైన ఫారెస్ట్ అధికారులతో అటవీ చట్టాలు, అటవీరక్షణ, సహజ అడవులు, నర్సరీలు, ప్లాంటేషన్ వంటి అంశాలపైన శిక్షణ ఉంటుందన్నారు. ప్రతీ రోజు ఫీల్డ్ విజిటింగ్‌తో పాటు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మణుగూరు ఏరియా పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఉంటుందన్నారు. ఈ వారం రోజుల పాటు శిక్షణ పొంది కొత్త బీట్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles