రక్తదానం మహా దానం..


Mon,November 11, 2019 01:51 AM

చింతకాని: అన్ని దానాల్లో రక్తదానం ముఖ్యమైనదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చింతకాని మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో చింతకాని మండల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌తో కలసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తంలాగా రక్తం ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజూ సామాజిక మాధ్యమాల్లో రక్తం కావాలంటూ ఏదో ఒక మెస్సేజ్ వస్తుందని, అలాంటి వారికి చింతకాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదానం గొప్ప అవకామన్నారు. అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ స్వయంగా వెళ్లి పలకరించి, అభినంధించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు మనోహర్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, సర్పంచ్‌లు బండి సుభద్ర, కన్నెబోయిన కుటుంబరావు, ఎంపీటీసీ మేకనబోయిన రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ కోలేటి సూర్యప్రకాశ్, గ్రామ పెద్దలు కిలారు సరోజినీ, జగన్మోహనరావు, కార్యదర్శి సైదులు, మాజీ ఎంపీపీ నారపోగు వెంకటేశ్వర్లు, యూత్ సభ్యులు కోల్లి ఉపేందర్, పోతగాని పుల్లారావు, రహమతుల్లా, శివ, హరికృష్ణ, మైబు, వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్యశిబిరం విజయవంతం
మండల కేంద్రంలో గల చింతకాని ఉన్నత పాఠశాలలో ఖమ్మానికి చెందిన ఓ ప్రవేటు దవాఖానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌తో కలసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిరుపేద రోగులు సద్వినియోగపరచుకోవాలన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles