12,13 తేదీల్లో జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన


Mon,November 11, 2019 01:51 AM

కొత్తగూడెం అర్బన్: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ నెల 12, 13వ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆరు గంటలకు సోమాజిగూడ నుంచి బయల్దేరి 9.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంటారు. 10.30 గంటలకు కురవి నుంచి కందికొండ టెంపుల్‌ను దర్శించుకొని మధ్యాహ్నం 2 గంటలకు భద్రాచలం రోడ్ ఐటీసీ అతిథి గృహంలో బస చేస్తారు. ఈ నెల 13న ఉదయం 8.30 గంటలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం 10 గంటలకు ఐటీడీఏ అధికారులతో సమావేశమవుతారు. 11.30 గంటలకు భద్రాచలంలో నూతనంగా నిర్మించిన బాలుర పోస్టు మెట్రిక్ వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. 12 గంటలకు మణుగూరులోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్‌ను, మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్తగూడెంలోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవనాలను, సాయంత్రం 3 గంటలకు ఇల్లెందులో బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు తరగతుల భవనాన్ని, 4 గంటలకు సింగరేణి మండలం బాలుర రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles