సుప్రీం కోర్టు తీర్పుపై ఎలాంటి ర్యాలీలూ వద్దు


Sat,November 9, 2019 11:51 PM

కొత్తగూడెం నమస్తేతెలంగాణ : రామ జన్మభూమి, బాబ్రీమసీదు భూ సమస్యపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జిల్లాలో ప్రజలు ఎలాంటి ర్యాలీలు ప్రకటనలు చేయకూడదని కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. తీర్పు విషయంలో ఎలాంటి ఆందోళనలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రధాన కూడలిలో అధిక సంఖ్యలో జనం గుమికూడినా, వాదనలకు దిగినా, మారణాయుధాలు ధరించినా, ఆర్ద్థనాదాలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాతలు ద్వారా గానీ, సందేశాలు ద్వారా గానీ ప్రకటనలు జారీ చేయకూడదన్నారు. శాంతిభద్రతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles