జగన్మోహిని అలంకరణలో రామయ్య


Sat,November 9, 2019 11:51 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామికి శనివారం జగన్మోహిని అలంకారం గావించారు. తెల్లవారు జామున 4.30 నిమిషాలకు రామయ్యకు సుప్రభాత సేవ నిర్వహించి, పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అంతరాలయంలో ఉత్సవ మూర్తులకు (స్వర్ణమూర్తులు) అభిషేకం చేశారు. ఉదయం 8.30 నుంచి 10గంటల వరకు స్వర్ణ తులసి పుష్పార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు జగన్మోహినిగా రామయ్యను అలంకరించారు. భక్తరామదాసు చేయించిన దివ్యాభరణాలను, ఇతరత్ర భక్తులు సమర్పించిన ఆభరణాలను స్వామికి అలంకరింపజేశారు. సాయంత్రం 6గంటలకు దర్భార్‌సేవ అనంతరం 108 లీటర్ల క్షీరములను, 25 రకాల పండ్లను నైవేథ్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. పోలీస్ బందోబస్తు నడుమ ఈ ఉత్సవాన్ని అంగరంగవైభవంగా జరిపారు. అనంతరం రామయ్యను తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles