డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేయాలి


Sat,November 9, 2019 05:27 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మండల ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల వారీగా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల ఏర్పాటుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అధికారులు అప్పగించని, అటవీశాఖకు సంబంధించిన భూములు.. తదితర సమగ్ర వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల ఏర్పాటుపై తక్షణం సివిల్ పనులు ప్రారంభించాలన్నారు. ప్రతీ మండలంలో ఆరు పంచాయతీల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు అడ్వాన్సు నిధులు మంజూరు చేశామని, ఇంకుడు గుంతల నిర్మాణంలో ముందంజలో ఉన్న మండలాలకు అదనంగా మరో మూడు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. అందువల్ల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ఇంకుడు గుంతల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles