-లక్ష కుంకుమార్చన పూజల రుసుము పెంపు
భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం స్వామివారి పట్టాభిషేకం, లక్ష కుంకుమార్చన పూజల రుసుమను పెంచింది. నవంబర్1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ప్రతీ పుష్యమీ నక్షత్రం రోజున స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. గతంలో రూ.250 రుసుము ఉండగా, ఇప్పుడు నిత్యకల్యాణానికి ఉన్న రుసుము రూ.1000లతో సమానంగా పట్టాభిషేకం రుసుమను పెంచారు. ఈ తంతులో పాల్గొనే భక్తులకు కండువా, జాకెట్ పీసు, పెద్దలడ్డూ, అరకేజీ పులిహోర, నలుగురికి దర్శనం, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. లక్ష కుంకుమార్చన పూజ ప్రతీ ఏకాదశి రోజున నిర్వహిస్తారు. గతంలో రూ.250 పూజ రుసుము ఉండగా, ప్రస్తుతం దీన్ని దేవస్థానం రూ.500లకు పెంచింది. గర్భగుడిలో ఈ పూజలు నిర్వహిస్తారు.