భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు


Sat,November 9, 2019 05:27 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి ముందుగా సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అభిషేకం చేశారు. తదుపరి ఆరాధన, ఆరగింపు, అర్చన, పుణ్యఃవచనం, నివేదన తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. తదుపరి రాముని నిత్యకల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.నేడు స్వామివారికి జగన్మోహిని అలంకారం
భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం జగన్మోహిని అలంకారం గావించనున్నారు. తెల్లవారు జామున 4.30నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. తదుపరి పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అంతరాలయంలో ఉత్సవ మూర్తులకు (స్వర్ణమూర్తులు) అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నిమిషాల నుంచి 10గంటల వరకు స్వామివారికి స్వర్ణ తులసి పుష్పార్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు జగన్మోహిణిగా రామయ్యస్వామిని అలంకరిస్తారు. భక్తరామదాసు చేయించిన దివ్యాభరణాలను, ఇతరత్ర భక్తులు సమర్పించిన ఆభరణాలను స్వామివారికి అలంకరిస్తారు. సాయంత్రం 6గంటలకు దర్భార్‌సేవ అనంతరం స్వామివారికి 108 లీటర్ల క్షీరములను, 25 రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. పోలీస్ బందోబస్తు నడుమ ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. అనంతరం స్వామివారిని తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ గావించనున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథచార్యులు నమస్తే తెలంగాణకు తెలిపారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles