ఘనంగా రాముని నిత్యకల్యాణం


Fri,November 8, 2019 12:46 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంను సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. అనంతరం ఆలయంలోని బేడా మండపంలో రామునికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles