రైఫిల్ ఆడియో లాంచ్ చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు


Fri,November 8, 2019 12:46 AM

కొత్తగూడెం టౌన్ : రైఫిల్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కొత్తగూడేనికి చెందిన కవి, రచయిత, గాయకుడు మద్దెల శివకుమార్ రచించిన పాటలను సింగర్ ఆఫ్ సింగరేణి అల్లి శంకర్ పాడిన ఆడియో సీడీని గురువారం రాత్రి స్థానిక పీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. రైఫిల్ సినిమాలో పాడిన మొదటి పాటను ఎమ్మెల్యే వనమా, రెండవ పాటను జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కొత్తగూడెం నుంచి సినిమాలో పాటలు పాడే అవకాశం రావడం మన కళాకారుల అదృష్టమని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో పాడే అవకాశం రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సింగరేణి జీఎం ఆనందరావు, డీపీఆర్‌వో శీలం శ్రీనివాస్, గొల్లపల్లి దయానందరావు, డాక్టర్ నాగరాజు, సినీ రంగ అభిమానులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles