గ్రంథాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన దిండిగల రాజేందర్


Fri,November 8, 2019 12:45 AM

జూలూరుపాడు : మండల కేంద్రంలోని గ్రం థాలయానికి కేటాయించిన స్థలాన్ని కొం దరు ఆక్రమించారు. దీంతో గ్రామానికి చెందిన కొంత మంది ప్రజలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగలతో పాటు ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం కబ్జాకు గురైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్రంథాలయానికి 16 కుంటల స్థలాన్ని కేటాయించారని, కొంత మంది స్థలాన్ని గత కొన్ని రోజుల క్రితం ఆక్రమించుకొని పెన్సింగ్ వేశారని, రికార్డుల ప్రకారం గ్రంథాలయ స్థలం కేటాయించి ఉన్నప్పటికీ తమ అనుమతి లేకుండా ఈ స్థలం చుట్టూ ఎందుకు పెన్సింగ్ వేశారని ప్రశ్నించారు. మీ వద్ద స్థలానికి సంబంధించి ఏమైనా పత్రాలు ఉంటే చూపించాలని కోరారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట గ్రంథపాలకుడు నవీన్, టీఆర్‌ఎస్ నాయకులు మోదుగు ప్రభాకర్, వేల్పుల నరసింహారావు, సురేష్ పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles