రోజుకొ మలుపు


Thu,November 7, 2019 12:35 AM

-నిగ్గు తేల్చిన మర్లపాడు డంపు..
-నేడు మీడియాకు చూపించే అవకాశం
-సత్తుపల్లిలో మరో రెండు డంపులున్నట్లు అనుమానం..
-విచారిస్తున్న పోలీసులు
-మదార్ వెనకున్నది ఎవరనేది తేల్చే పనిలో రక్షకభటులు


ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సత్తుపల్లిలో నకిలీ నోట్ల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం సూత్రధారులను, పాత్రధారులను గుర్తించేందుకు పోలీసులు తీవ్రం గా కృషి చేస్తున్నారు. సత్తుపల్లిలో కోట్ల రూపాయల నకిలీ నోట్లు పట్టుబడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో, ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని పోలీస్ కమిషనర్‌ను ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించారు. మర్లపాడు డంపులో ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయన్న విషయాన్ని పోలీసులు అంచనా వేయలేకపోతున్నారు. పోలీస్ పహారాలో ఉన్న ఈ డంపును తెరవాలంటే సంబంధిత వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ డంప్ ఏర్పాటులో కీలక సూత్రధారి మదార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. రిమాండ్‌లో ఉన్న వ్యక్తి వస్తేనే డం పును తెరిచేందుకు వీలుంటుందని కోర్టుకు పోలీసులు వివరించారు. కోర్టు అనుమతితో మదార్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మదార్‌ను తీసుకుని గురువారం డంపును తెరవవచ్చని తెలిసింది. డంపును తెరిస్తే... అందులో ఉన్న నగదు నకిలీదా... అసలుద్లా... రైద్దెన పాత నోట్లా... అనేది తేలుతుంది.

డంప్ తెరిచిన తరువాత మీడియా సమావేశంలో వివరాలను పోలీస్ కమిషనర్ వెల్లడించవచ్చు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందాలు ఈ నకిలీ రాకెట్ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మదార్‌పై తమిళనాడు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో ఉన్న కేసుల వివరాలను కూడా పోలీసులు తెప్పిస్తున్నారు. పోలీస్ శాఖలో మదార్‌కు సహకరించిన వారిని కూడా జిల్లా పోలీస్ బాస్ గుర్తించినట్లు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లినట్లు తెలిసింది. మదార్ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా విచారణలో బయటపడినట్లు సమాచారం.

సత్తుపల్లిలో మరో రెండు డంపులు...?
వేంసూరు మండలం మర్లపాడులో నకిలీ నోట్ల డంపును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిని గురువారం నిగ్గు తేల్చే అవకాశముంది. ఈ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసులు తమ విచారణను ముమ్మరం చేశారు. మదార్‌కు సహకరించిన వ్యక్తులను విచారించి అనేక విషయాలను తెలుసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో సత్తుపల్లి పట్టణంలో మరో రెండు డంపులున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అవి ఎక్కడున్నాయన్న విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ కొత్త డంపుల విషయం కూడా బయటకు పొక్కితే... కారకులైన వారు తప్పించుకునే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారని, అందుకే తమ కింది స్థాయి అధికారులకు తెలియనివ్వడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు శాఖలోని ఒకరు నమస్తే తెలంగాణతో చెప్పారు. పోలీసుల అనుమానమే నిజమైతే... సత్తుపల్లిలోని ఆ డంపులు ఎక్కడున్నాయి..?

అందులో ఉ న్నవి కొత్త నోట్లా..? నకిలీ నోట్లా....? అనేది తెలియాల్సుంది. ఆ రెం డు డంపులోనూ కొత్త నోట్లే ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నా రు. మర్లపాడు డంపులో రైద్దెన పాత నోట్లను, మిగిలిన రెండు డంపులలో ఒకచోట కొత్త నోట్లు, మరోచోట నకిలీ నోట్లు నిల్వ ఉంచినట్లు గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మదార్‌ని కస్టడీలోకి తీసుకున్న తరువాత అతని సమక్షంలోనే మర్లపాడు డంపును తెరుస్తార ని, ఆ తరువాత అతని ద్వారానే మిగిలిన రెండు డంపుల విషయాన్ని కూడా పోలీసులు బహిర్గతపరిచే అవకాశముందని సమాచారం.

మదార్‌పై పలువురి ఫిర్యాదు...
మదార్ చేతిలో మోసపోయిన కొందరు పోలీసుల ముందుకు వస్తున్నారు. మూడు రోజుల నుంచి సుమారు 20 మంది మదార్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదేళ్లుగా మ దార్ ఏయే వ్యాపారాలు చేశాడో... వాటిలో అతనికి సహకరించిన వారు ఎవరో.. అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు. మదార్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు లోతుగా విచారించనున్నారు

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles