బీమా చెక్కు అందజేత


Thu,November 7, 2019 12:32 AM

ఇల్లెందు రూరల్, నవంబర్ 6 : మండలంలోని రాఘబోయినగూడెం గ్రామపంచాయతీకి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త బోడ ఇసాక్ అనారోగ్యంతో మృతిచెందారు. పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ఇసాక్ మృతి చెందడంతో పార్టీ అదిష్టానం ప్రకటించిన విధంగా ఇసాక్ కుటుంబానికి పార్టీ తరుపున బీమా మంజూరైంది. ఇసాక్ సతీమణి ద్వారక బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రూ.2లక్షలు విలువ చేసే బీమా చెక్కును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాఘబోయినగూడెం గ్రామపంచాయతీ శాఖ అధ్యక్షుడు జాన్‌బాబు, నాయకులు అబ్రహం, రాఘవ పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles