ఘనంగా రామయ్య నిత్యకల్యాణం


Thu,November 7, 2019 12:32 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ నవంబర్ 6 : భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అర్చకులు స్వామివారికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చి రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంను సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. తదుపరి స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles