ముగిసిన లీగ్ దశ కబడ్డీ మ్యాచ్‌లు


Thu,November 7, 2019 12:32 AM

-సెమీస్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు
పాలకుర్తి నవంబర్ 6 : తెలంగాణ 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 14 ఏళ్లలోపు బాలబాలికల కబడ్డీ పోటీలు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా ప్రజాప్రరిషత్ ఉన్నత పాఠశాలలో రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం లీగ్ దశలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగగా చివరకు 8 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఆతిథ్య ఉమ్మడి వరంగల్ బాలబాలికల జట్లు అన్ని జట్లపై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. బాలికల విభాగంలో ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ బాలుర విభాగంలో వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ జట్లు ముందడుగు వేశాయి. రెండో రోజు జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మదార్ క్రీడలను తొలుత ప్రారంభించారు. రాష్ట్ర కబడ్డీ నిర్వాహకులు రామారావు, ప్రవీణ్‌రెడ్డి, రసూల్, ప్రవీణ్ కుమార్ క్రీడలను పరిశీలించారు. ప్రముఖ జవాన్, బమ్మెర వాసి బిక్షపతి జాతీయ స్థాయికి అర్హత సాధించే 30 మంది క్రీడాకారులకు ట్రాక్‌సూట్‌లను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ ప్లోర్ లీడర్ మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందుతాయన్నారు. మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయన్నారు. ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు అధిక ప్రాధానత్య ఇస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే ఆసక్తి పెంచుకోవాలన్నారు. పాలకుర్తిలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం గర్వించదగ్గ విషయన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles