ఎర్ర బంగారానికి ఆల్‌టైం రికార్డు ధర


Thu,November 7, 2019 12:32 AM

ఖమ్మం వ్యవసాయం: గతంలో ఎన్నడూ లేని విధంగా తేజా రకం ఏసీ మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. దీంతో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం ఉదయం నగర వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన జెండా పాటలో రికార్డు స్థాయి లో క్వింటాకు ఒక్కంటికి రూ 17,800 ధర నిర్ణయించి పంటను మిర్చి ఖరీదు దారులు కొనుగోలు చేశారు. ఇంతకాలం శీతల గిడ్డంగులలో నిల్వ ఉంచుకున్న రైతులు, వ్యాపారులకు కలిసి వచ్చినైట్లెంది. సీజన్ ఆరంభంలో క్వింటా ఒక్కంటికి గరిష్ట ధర రూ 9,500 12 వేలు లోపు మాత్రమే ధర పలికింది. ఇది కాస్త అంచెలంచెలుగా పెరుగుకుంటూ ఏకంగా క్వింటాకు రూ 17,800 వేల పైచిలుకు పెరగడంతో అటు అధికారులతో పాటు, ఇటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ఆరంభంలో కొం దరు రైతులు మార్కెట్ల పంటను విక్రయిం చుకోగా, మరికొందరు రైతులు భవిష్యత్‌లో మరింత ధర పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో కోల్డ్‌స్టోరే జీల్లో పంటను నిల్వ ఉంచుకున్నారు.


ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట మార్కెట్‌కు రాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరడంతో తిరిగి రైతులు నిల్వ ఉంచిన పంటను అమ్ముకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఉదయం మార్కెట్లో జరిగిన జెండాపాటలో ఏసీ రకం మిర్చికి గరిష్ట ధర క్విం టాకు రూ 17,800 పలికింది. సాధారణ రకం పంటకు గరిష్ట ధర క్వింటాకు రూ 8, 800 పలుకగా, కనిష్ట ధర 6వేలు పలికింది. తాలు రకం పంటకు క్వింటాకు ఒక్కంటికి రూ 4వేలు చొప్పున ధర నిర్ణయించి వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. జాతీయ మార్కెట్లో సైతం తేజారకం పంటకు మంచి డిమాండ్ ఉండటంతో స్థానిక ఖరీదుదారులతో పాటు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీకి చెందిన వ్యాపారులు పంటను కొనుగోలు చేస్తున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles