గిరిజన క్రీడాకారుల ఎంపికలు


Thu,November 7, 2019 12:32 AM

పాల్వంచ రూరల్, నవంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన కీడ్రా పాఠశాలలోని క్రీడా విద్యార్థుల ఎంపికలు బుధవారం మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో ప్రారంభమయ్యాయి. బుధవారం బాలికలకు, గురువారం బాలురకు వివిధ రకాల క్రీడలు నిర్వహించి ప్రతిభ చూ పిన వారిని ఎంపిక చేస్తారు. జిల్లాలోని 8 జోన్ల నుంచి 603 మంది బాలికలు పాల్గొన్నారు. వీరికి అధ్లెట్స్, వాలీబాల్, కబ డ్డీ, ఖోఖో, ఛెస్, క్యారమ్స్, టెన్నికాయిటలలో పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికలను జిల్లా సంక్షేమ అధికారి జహీరుద్దీన్ బుధవారం పారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు త్వరలో ఉట్నూరులో జరుగనున్న రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారు. గురువారం బాలురకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ పుట్టా శంకరయ్య, ఏటీడీవో వీరసోములు, సత్యనారాయణ, క్రీడా ఉపాధ్యాయులు వెంకటనారాయణ, వీరూనాయక్, బాలసుబ్రమణ్యం, అన్నం వెంకటేశ్వర్లు, బుగ్గా వెంకటేశ్వర్లు, శ్రీనగేష్, రాములు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles