పల్లె పల్లెకూ రవాణా సేవలు


Tue,November 5, 2019 12:34 AM

-రోడ్డెక్కిన 249 బస్సులు
-మూడు డిపోల నుంచి బస్సులు ఫుల్
-కనిపించని ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం
-ఏర్పాట్లపై ప్రజానీకం హర్షం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు డిపోల పరిధిలో సోమవారం 249 బస్సులు రోడ్డెక్కాయి. పల్లె సర్వీసులు మొదలుకొని ఏసీ రాజధాని సర్వీసుల వరకు అన్ని రూట్లలో తిరిగాయి. కార్తీక సోమవారం కావడంతో దేవాలయాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సులను ఆశ్రయించడంతో మరింత రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 249 బస్సులను నడిపించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు జిల్లా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టి అధిక సంఖ్యలో బస్సులను యథావిధిగా నడుపుతున్నారు. సమ్మె కారణంగా ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బందులు పడొద్దని ముందు నుంచి ప్రభుత్వం చెబుతుండటంతో దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టి ప్రజారవాణాకు ఎక్కడా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమ్మె తాలూకు ప్రభావం ఎక్కడా పడకుండా ప్రధానమైన రూట్లే కాకుండా పల్లెలకు కూడా బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు.

కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి బస్సులను అన్ని ప్రధాన రూట్‌లకు నడుపుతూ వచ్చారు. సోమవారం కూడా హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, వరంగల్, పల్లె ప్రాంతాలకు సర్వీసులన్నింటినీ సాధారణ రోజుల్లాగానే నడిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు డిపోలలో మొత్తం 249 బస్సు సర్వీసులు నడిచాయి. కొత్తగూడెం డిపోలో 58 ఆర్టీసీ, 21 హైర్ బస్సులు, భద్రాచలంలో 71 ఆర్టీసీ, 22 హైర్ బస్సులు, మణుగూరు డిపోలో 56 ఆర్టీసీ, 21 హైర్ బస్సు సర్వీసులు నడిచాయి. మొత్తంగా 90శాతం పైగా ఆర్టీసీ బస్సులు నడిచాయి. కాంట్రాక్టు క్యారియర్స్ 53, మోటార్ క్యాబ్స్ 191 నడిపి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

మూడు డిపోల నుచి
జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 249 బస్సులు రోడ్డెక్కాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు డిపోల్లో మొత్తం 249 బస్సు సర్వీసులు నడిచాయి. కొత్తగూడెం డిపోలో 58 ఆర్టీసీ, 21 హైర్ బస్సులు, భద్రాచలంలో 71 ఆర్టీసీ, 22 హైర్ బస్సులు, మణుగూరు డిపోలో 56 ఆర్టీసీ, 21 హైర్ బస్సు సర్వీసులు నడిచాయి. మొత్తంగా 90శాతం పైగా ఆర్టీసీ బస్సులు నడిచాయి. కాంట్రాక్టు క్యారియర్స్ 53, మోటార్ క్యాబ్స్ 191 నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

సురక్షితంగా గమ్యస్థానాలకు
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో ఉండటంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రైవర్లకు అవసరమైన సూచనలు, సలహాలను జిల్లా రవాణాశాఖ అధికారులు ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ మన్ననలు పొందుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలోని డ్రైవర్లు క్రమశిక్షణగా డ్రైవింగ్ చేస్తుండటంతో ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. దీంతో వారిపై మరింత నమ్మకం ఏర్పడింది.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles