గంజాయి రవాణాపై ఉక్కుపాదం


Tue,November 5, 2019 12:31 AM

కొత్తగూడెం క్రైం : పదిరోజులుగా జిల్లా పోలీసు లు గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసి సుమారు రూ.92 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. పది రోజుల్లో మొత్తం నాలుగు కేసుల్లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు పోలీసులు పట్టుకున్న ముగ్గురు వ్యక్తుల వద్దనుంచి రూ. 8,25,000 విలువైన గంజాయిని, భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్లో సుమారు రూ.76 లక్షల విలువైన గంజాయిని, పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన వ్యక్తి వద్ద రూ.8,10, 000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు.


మొత్తం 8 మంది వ్యక్తుల వద్ద నుంచి సు మారు రూ.92 లక్షలు విలువైన గంజాయిని స్వా ధీనం చేసుకున్నారని, పట్టుబడిన వారిపై ఎన్‌డీపీఎస్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. గంజాయి రవాణాను అదుపు చేయడంలో జిల్లాపోలీసు అధికారులు, సి బ్బంది పనితీరును ఎస్పీ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన సీలేరు, ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి ఏజెన్సీ ప్రాంతం నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ర్టాలకు గంజాయిని రవాణా చేసే వారిని అడ్డుకోవడంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం గస్తీ, వాహన తనఖీలు నిర్వహించడంలో పోలీసు అధికారుల పనితీరు ప్రశంసనీయమన్నారు. గంజాయి మత్తుకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తమ పిల్లల కదలికలను కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles