బ్రెయిన్‌డెడ్ అయిన కానిస్టేబుల్ అవయవదానం


Mon,November 4, 2019 12:32 AM

అన్నపురెడ్డిపల్లి: అనుకోని ప్రమాదం శరీరాన్ని గాయపరిచింది.. జీవం ఉన్నా శాశ్వతంగా అచేతన స్థితిలో పడేసింది.. కానీ.. కుటుంబ సభ్యులు సహృదయంతో తీసుకున్న నిర్ణయం మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తోలెం ప్రభాకర్ (31) మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పరిస్థితి విషమించి ప్రభాకర్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. అవయవదానంతో మరికొందరు బాధితులకు మేలు జరుగనుంది. అవయవదానం అనంతరం ప్రభాకర్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆయన స్వగ్రామమైన ఇల్లెందు మండలం పూబెల్లికి తరలించారు. కానిస్టేబుల్ మృతి పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ , పోలీస్ అధికారులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles