పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Mon,November 4, 2019 12:32 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డకు మేన మామగా సీఎం కేసీఆర్ కొండంత అం డ గా నిలుస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వార వేల కుటుంబాల్లో ఆర్థిక భారం తగ్గి ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని మంత్రి తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద మంజూరైన సుమారు రూ. 4 కోట్ల 92 లక్షల విలువైన 493 చెక్కులను వీడివోస్ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆయన సతిమణీ వసంతలక్ష్మీతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద మంజూరైన సుమారు రూ. 4 కోట్ల 13 లక్షల విలువైన 414 చెక్కులు, రఘునాథపాలెం మండలం పరిధిలో సుమారు 79.1 లక్షల విలువైన 79 చెక్కులను ఆడబిడ్డలకు చీరె, పండ్లు, సారెతో చెక్కులను వారు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడు తూ ఆడపడుచుల వివాహాలు జరిపించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా తల్లిదండ్రులను ఆదుకోవాలనే సద్దుదేశంతో పాటు ప్రతీ నిరుపేద ఆడపిల్ల సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ సర్కార్ పార్టీలు, రాజకీయాలకతీతంగా అర్హతను ప్రాతిపదికగా సం క్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు.


పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఆడపిల్లల తల్లులకు పెద్దన్నలాగా, పెళ్లి కూతుర్లులకు మేనమామాలా అందుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకా లను అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. వివాహాలు జరిపించిన యువతుల కుటుంబాలకు తొలినాళ్లలో రూ. 51 వేలు అందించిన ప్రభు త్వం తరువాత రూ. 75 వేలు ఇచ్చిందన్నారు. తాజాగా ఈ పథకం ద్వారా లక్ష నూటపదహారు రూపాయలు అందిస్తున్నదంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేదలపై ఉన్నటువంటి ప్రేమ ఏమిటో తెలుస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమనీ, పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకట రమణ, జడ్పీటీసీ ప్రియాంక, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు నాయకులు తదితరులున్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles