అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై దుష్ప్రచారం చేయొద్దు


Mon,November 4, 2019 12:31 AM

కొత్తగూడెం క్రైం: అయోధ్య తీర్పుపై అత్యున్నత న్యాయ స్థానం ఇవ్వబోయే తీర్పుపై ఎటువంటి దుష్ప్రచారాలు చేయవద్దని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. ఈనెల అత్యున్నత న్యాయ స్థానం రామ మందిరం విషయంలో తీర్పు వెలువరచనున్న సందర్భంగా ఎస్పీ సునీల్‌దత్ కొత్తగూడెం సబ్‌డివిజన్ పరిధిలోని మత పెద్దలతో కొత్తగూడెం క్లబ్‌లో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈశాంతి చర్చల్లో ఎస్పీ మాట్లాడుతూ.. అత్యున్న న్యాయస్థానం ఇచ్చే తీర్పును గౌరవించాలన్నారు. ఈవిషయంలో ఎవరూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు చేసి, వివాదాలకు తెరలేపకూడదని కోరారు. ఎవరైన ఈ విషయంలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు శాంతిమార్గమే సుగమం అని అన్నారు. కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ అలి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ లావుడ్యా రాజు, టూటౌన్ ఇన్‌స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ లింగనబోయిన ఆదినారాయణ, చుంచుపల్లి సీఐ బొడ్డు అశోక్ కుమార్, జూలూరుపాడు సీఐ నాగరాజు, సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పట్టణ, మండలాల పరిధిలోని మత పెద్దలు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles