పద్మశాలీల ఐక్యతకు తార్కాణం వన సమారాధనోత్సవం


Mon,November 4, 2019 12:31 AM

రఘునాథపాలెం:ఐక్యతకు తార్కాణం పద్మశాలీల వన సమరాధనోత్సవమని రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు పువ్వాడ అజయ్ కు మార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని చెరుకూరి మామిడితోటలో జరిగిన పద్మశాలీల వన సమరాధనోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నగరంలో పద్మశాలీల కల్యాణ మం డపం కోసం స్థలం, నిధులు కేటాయింపు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని గుర్తు చేశారు. ప్రతీ కులానికి ఐక్యత ఉన్నప్పుడే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి, వారి అభ్యున్నతే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్తీకమాస వనసమరాధనోత్సవం ఆప్యాయతానురాగాలకు చిహ్నమని పేర్కొన్నారు. అన్ని రంగాలలో చైతన్యవంతులైనప్పుడే అభివృద్ధిలో ముందుకు సాగుతారని సూచించారు. అనంతరం పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోషిక యాదగిరి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమర్తపు మురళీలు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ బాధ్యేల సేవలను కొనియాడారు.


ఇదే వేదికపై ఇటీవలె రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్లుగా కొలువుపొందిన చెన్నా నాగేశ్వరరావు, ఉదారపు నరేశ్‌లను మంత్రి శాలావాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు రకాల ఆటపోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. వనసమారాధనలో భాగంగా శ్రీరక్ష హాస్పిటల్, దివ్య డయాగ్నస్టిక్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు, కా ర్పొరేటర్లు పగడాల నాగరాజు, చావా నారాయణరావ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లే శం, మల్లేశం సినిమా ఫేం చక్రపాణి ఆనంద్, ట్రా ఫిక్ ఏసీపీ సదానిరంజన్, డీసీపీ దంపతులు దా సరి మురళీధర్, పూజ, పద్మశాలి డాక్టర్లు గోంగూ ర వెంకటేశ్వర్లు, కూరపాటి ప్రదీప్, రాజ్ కుమార్, సామల అమర్‌నాథ్, వేముల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles