ప్రతీ ఎకరాకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించాలి


Sun,November 3, 2019 03:10 AM

మణుగూరు, నమస్తే తెలంగాణ : అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు సాగు భూములను సస్యశ్యామలం చేస్తుందని, ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించేందకు అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన ప్రత్యేకంగా సీతారామ ప్రాజెక్టు, మణుగూరు ఇరిగేషన్‌శాఖ, టీఎస్ ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందించి సస్యశ్యామలం చేసేందకు అవసరమైన కొత్త ప్రతి పాదనలు సిద్ధం చేచేస్తామన్నారు. మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా చేసి కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువుకు నీటిని లిప్ట్ చేసి అక్కడ నుంచి అన్ని చెరువులు, కుంటల్లోకి నీరు నింపాలనే ప్రధాన లక్ష్యమని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అవసరమైన నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు, ఇరిగేషన్ శాఖ, టీఎస్ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు సర్వే నిర్వహించి 10 రోజుల్లో కొత్తగా ప్రతి పాదనలు తయారు చేసి అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు ఎక్కడ నుంచి తుమ్మల చెరువుకు లిఫ్ట్ చేసే ప్రతి పాధనలు సీతారామప్రాజెక్టు ఇంజనీరింగ్ ఆధికారులు, లిప్ట్‌లు ఎక్కుడ ఏర్పాటు చేసి చెరువులోకి నీరు నింపే ప్రతి పాధనలు టీఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు, ప్రతి ఎకరాకు నీరు అందజేసే విధంగా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు అవసరమై అన్ని రకాల ప్రతి పాదనలు సిద్ధ్దం చేయాలని చెప్పామన్నారు. ఇందులో భాగంగానే సీతారామ ప్రాజెక్టు, ఇరిగేషన్ శాఖ, టీఎస్ ఐడీసీ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సీతారామ ప్రాజెక్టు అధికారులు ఈఈ బాబురావు, డీఈ వెంకటేశ్వరరావు, మణుగూరు ఇరిగేషన్‌శాఖ అధికారులు డిఈ నాగమల్లేశ్వరరావు, ఏఈ భాస్కర్ రావు, టీఎస్ ఐడీసీ ఏఈ దీప్, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, అశ్వాపురం మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కొడి అమరేందర్, ఉసా అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles