నామా సేవా సమితి సేవలను విస్తృత పరచాలి


Sun,November 3, 2019 03:10 AM

-వీడియో కాన్పరెన్స్‌లో ఈసీ సభ్యులకు నామా సూచనలు
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వరరావు నామా సేవాసమితి ఈసీ మెంబర్స్‌తో శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచారు. ఈ సందర్భంగా ఎంపీ నామా సేవాసమితి కార్యక్రమాలను, సభ్యుల పనిని సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నామా మాట్లాడుతూ.. నామా సేవాసమితి కార్యక్రమాలను విస్తృత పరచాలని సూచించారు. సామాజిక సేవతో పాటు సమాజ సేవ కూడా సేవాసమితి ఆధ్వర్యంలో చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న, చేసిన కార్యక్రమాలను సేవాసమితి ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లాలని నామా నాగేశ్వరరావు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రజలకు సేవలు అందించే విషయంలో ముందుండాలన్నారు. విద్యా, వైద్యం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సహకారం అందించాలన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు.


రైల్వే ఇజత్ పాసుల అర్హులను గుర్తించే విషయంలోనూ వారితో దరఖాస్తు చేయించే విషయంలోను సేవా సమితి సభ్యలు కీలక భూమిక పోషించాలన్నారు. దేశంలో తొలి సారిగా రైల్వే పాసులు జారీ చేయడం జరిగిందన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో 66వేల మంది పేదలకు ఇజత్ రైల్వే పాసులు అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అ వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంప్ కార్యాలయ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, సేవాసమితి జిల్లా అధ్యక్షుడు పాల్వంచ రాజేష్, ప్రధాన కార్యదర్శి చీకటి రాంబాబు, నల్లమల వేణు, చండ్రా సతీష్, రేగళ్ళ కృష్ణప్రసాద్, నన్నబోయిన కాళేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles