ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ


Sun,November 3, 2019 03:09 AM

ఖమ్మం క్రైం, నవంబర్ 2 : వరంగల్ జోన్‌లో పనిచేస్తున్న తొమ్మిది మంది సీఐలను బదిలీ చేస్తూ శనివారం రాత్రి నార్త్‌జోన్ డీఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు సీఐలకు స్థాన చలనం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీసీఆర్‌బీలో సీఐగా పనిచేస్తున్న ఏ రమాకాంత్‌ను సత్తుపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సత్తుపల్లి టౌన్‌లో పనిచేస్తున్న టీ సురేష్‌కుమార్‌కు వరంగల్ ఐజీకు ఎటాచ్‌మెంట్ చేశారు. సత్తుపల్లి రూరల్ సీఐగా పనిచేస్తున్న టీ రవికుమార్‌ను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ వన్ సీఐగా బదిలీ చేశారు. ఆ స్థానంలో వరంగల్ ఐజీ ఎటాచ్‌మెంట్లో ఉన్న తాటిపాముల కరుణాకర్‌కు సత్తుపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐగా బదిలీ చేశారు.


బదిలీ అయిన అధికారులు రెండు మూడు రోజుల్లో ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాలని డీఐజీ ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే శనివారం సత్తుపల్లిలో కలకలం రేపిన దొంగరేపిన ఘటనే అందుకు కారణమైందని తెలుస్తోంది.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles