రామయ్య నిత్యకల్యాణం


Sun,November 3, 2019 03:09 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో శనివా రం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందె తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. అనంతరం ఆలయంలోని బేడా మండపంలో శ్రీసీతారామచంద్రమూర్తులకు ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles